శనివారం రామచంద్రపురం పట్టణంలోని తాలూకా శెట్టిబలిజ సంఘ సమావేశానికి కార్మిక శాఖ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంగీయులు ప్రశ్నించే తత్వం అలవాటు చేసుకోవాలని రామచంద్రపురం లో గత 30 సంవత్సరాలుగా తాలూకా శెట్టిబలిజ సంఘం ఏ విధమైన అభివృద్ధికి నోచుకోలేదని దానికి అవసరమైన నిధుల కోసం అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల నుండి పోరాడి నిధులు సమకూర్చుకోవాలని సంగం రాజకీయ ఒత్తిడిలకు దూరంగా ఉండాలని ఇప్పటివరకు ఉన్న సంఘ పెద్దలు రాజకీయాలకు సంఘాన్ని ఉపయోగించుకున్నారని ఆయన విమర్శించారు రాష్ట్రవ్యాప్తంగా తాను అనేక శెట్టిబలిజ సంఘాలను చూశానని అవన్నీ చాలా పటిష్టంగా ఉన్నాయని రామచంద్రపురం శెట్టిబలిజ సంగం మాత్రం ఏ విధమైన అభివృద్ధికి నోచుకోలేదని తాలూకా శెట్టిబలి సంఘ భవనాన్ని చూస్తే అర్థమవుతుందని ఆయన పేర్కొన్నారు అనంతరం తాలూకా శెట్టిబలిజ సంఘ భవనాన్ని పరిశీలించారు భవనం యొక్క దుస్థితిని చూసి ఆయన ఆవేదన చెంది త్వరలోనే సంఘ భవన అభివృద్ధి కోసం నిధులు సమకూరుస్తానని తెలియజేశారు