ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌పై బీజేపీ నేత సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ మామూలోడు కాదని.. ఆయన ఆలోచనలను అంచనా వేయలేమని అన్నారు. రాజధాని పేరు చెప్పి విశాఖపట్నంలో 500 కోట్లతో విలాసవంతమైన బంగ్లా కట్టుకున్నాడు తప్ప రాజధానికి 5 రూపాయలు కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు.పరిపాలనపై అవగాహన లేని వ్యక్తి గత ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలించారని సోము వీర్రాజు విమర్శించారు. వైసీపీకి గ్రామీణాభివృద్ధిపై అవగాహన లేదని అన్నారు. అందుకే గత ప్రభుత్వం గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని జగన్ నీరుగార్చారని విమర్శించారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.800 కోట్లను గ్రామ పంచాయతీలకు విడుదల చేసిందని తెలిపారు.విశాఖపట్నంలో ఊహించని పరిణామాలు చూస్తున్నామని సోము వీర్రాజు అన్నారు. పరిశ్రమల్లో ప్రమాదాలు పునరావృతం కాకూడదని తెలిపారు. విశాఖ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం చురుకైన పాత్ర పోషిస్తుందని తెలిపారు