ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధమ ప్రాధాన్యత.. గ్రామాల్లో ప్రతి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాము. ఈరోజు శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళిలో క్షేత్ర స్థాయి పరిశీలన చేసి స్థానిక సమస్యలు ప్రజలను నేరుగా అడిగి తెలుసుకున్నారు.సాగునీటి సమస్య, రహదారి సమస్యలు, పక్కా మురుగు కాలువ సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టడంతో పాటు సామాజిక భవన నిర్మాణాలు, ప్రభుత్వ కార్యాలయ సముదాయం నిర్మాణానికి చర్యలు తీసుకుంటాము.