ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వీడియోకాల్‌లో మాట్లాడుతూ రొమాన్స్ చేసిన ఎమ్మెల్సీ,,,,హనీట్రాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదుచేసిన వైసీపీ నేత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 25, 2024, 02:55 PM

వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వీడియో కాల్‌లో మాట్లాడుతూ అభ్యంతరకర రీతిలో ప్రవర్తించినట్లుగా ఉన్న వీడియో ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. రెండేళ్ల కిందట తన వద్ద పనిచేసిన డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొని అరెస్టయిన అనంతబాబు.. బెయిల్‌పై విడుదలై బయటకొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఓ వీడియో కాల్‌లో అవతలి వారితో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ అనంతబాబు.. ముద్దులు పెట్టడంతోపాటు అసభ్యకరంగా ప్రవర్తించినట్టు రికార్డయ్యింది. వైరల్ అవుతోన్న ఈ వీడియోపై స్పందించిన అనంతబాబు స్పందించారు.


తాను ఎలాంటి తప్పు చేయలేదన్న ఎమ్మెల్సీ.. వైరల్ అవుతోన్నది మార్ఫింగ్ వీడియో అని తెలిపారు. ఓ అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా వీడియోకాల్‌లో పిల్లలకు ముద్దులు పెట్టిన వాటిని ఎడిట్ చేశారని, మార్ఫింగ్‌ వీడియోతో తెలంగాణకు చెందిన ఒకరు గత ఆరు నెలలుగా తనను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని ఆయన అన్నారు. తన వీడియోలను మార్ఫింగ్‌ చేసి, తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ వెల్లడించారు. ఇందులో తనను ఉద్దేశపూర్వకంగానే ఇరికించారని ఎమ్మెల్సీ చెప్పారు.


దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల పోలీస్‌స్టేషన్‌లో జూన్ 1నే ఫిర్యాదు చేసినట్టు అనంతబాబు తెలిపారు. కానీ, ఆ ఫోన్ నెంబర్‌ను పోలీసులు ట్రేస్ చేయలేకపోయారని అన్నారు. తాజాగా, వీడియో బయటకు రావడంతో అనంతబాబు శుక్రవారం రాత్రి మళ్లీ ఫిర్యాదు చేశారు. దీనిపై రంపచోడవరం ఇంఛార్జి ఏఎస్పీ మాట్లాడుతూ.. సమగ్ర విచారణ కోసం పూర్తి సమాచారం అందించాలని ఎమ్మెల్సీని కోరినట్లు తెలిపారు.


ఆ వివరాలు రాగానే పోలీసులు విచారణ చేపడతారని అన్నారు. కాగా, అసలే అధికారం కోల్పోయి డీలాపడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి.. వరుసగా పార్టీకి చెందిన నాయకులు వివాదాల్లో చిక్కుకుపోవడం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇలాంటి వారిని పార్టీ నుంచి బహిష్కరించాలని అధినాయకత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. మరి దీనిపై ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి మరి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com