నేడు ఆదికవి నన్నయ యూనివర్సిటీ లో జరిగినటువంటి డ్రగ్స్, రాగ్గింగ్, ఆల్కహాల్ అవగాహనా సదస్సులో ముఖ్య అతిధిగా పాల్గొన్న టీడీపీ రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి Dr. గోరంట్ల రవి రామ్ కిరణ్.ఈ సందర్బంగా Dr.గోరంట్ల రవి రామ్ కిరణ్ మాట్లాడుతూ సమాజంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న డ్రగ్స్, ఆల్కహాల్, రాగ్గింగ్, కారణంగా యువత పేడద్రోవ పడుతుంది అని వాటి వల్ల అనేక మంది జీవితాలు నాశనం అయ్యాయి అని స్వల్ప ఆనందలకు వారు చేసిన తప్పులకు వారు మాత్రమే కాకుండా వారి వలన అనేక కుటుంబాలు శిక్షను అనుభవిస్తున్నారు అని అన్నారు. డ్రగ్స్ బారిన పడిన అనేకమంది విద్యార్థులు అనేక శారీరక రుగ్మాతలతో నా వద్దకు ట్రీట్మెంట్ కి వచ్చినప్పుడు వాళ్లు మద్యం, డ్రగ్స్, వల్ల కలిగిన సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా వారు పడుతున్న మానసిక, శారీరక భాదలను ఉదాహరణకు కొన్ని సందర్భాలని విద్యార్థులకు వివరించడం జరిగింది. ఈ సందర్భంలో విద్యార్థులు ఉద్దేశించి నేడు అనేక చెడు వ్యాసనాలకు విద్యార్థులు అడిక్ట్ అవుతున్నారు అవి కేవలం స్వల్ప ఆనందాలని ఇచ్చినప్పటికి వాటి ప్రభావం మన జీవితాలను తీవ్రస్తాయి లో నాశనం చేసే విధంగా మార్పులు తీసుకువచ్చే పరిస్థితులు అనేకమున్నాయి అని అందుకు విద్యార్థి దశ నుండే ప్రతి ఒక్కరు మత్తు పదార్ధాల వలన కలిగే సమస్యలను అవగాహనా చేసుకుని వాటికి దురంగా ఉండలని సూచించారు. అనంతరం కాలేజ్ యాజమాన్యం వైస్ ఛాన్సెలర్ వై. శ్రీనివాస్ గారి చేతులుమీదుగా Dr.రవి రామ్ కిరణ్ గారిని శాలువాతో సత్కరించి జ్ఞపికను అందజేయడం జరిగింది.