మనిషి 100 ఏళ్లు జీవించడం అనేది ప్రస్తుత తరంలో చాలా అరుదు. అయితే గ్రీన్‌లాండ్ షార్క్స్ అనే సొరచేపలు మాత్రం ఏకంగా 400 ఏళ్లకు పైబడి జీవిస్తున్నాయి. శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. 5 మీటర్లకు పైగా పొడవు ఉండే ఇవి ఉత్తర ధ్రువపు సముద్రపు లోతుల్లో జీవిస్తుంటాయి. గ్రీన్‌లాండ్ షార్క్స్ కంటిపాపలోని ప్రొటీన్లపై రేడియోయాక్టివ్ కార్బన్ డేటింగ్ సాయంతో వాటి వయసును శాస్త్రవేత్తలు లెక్కించగలిగారు.