అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో ఘోరం జరిగింది. మద్యానికి బానిసైన ఓ తండ్రి మతిస్థిమితం లేని కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కొన్ని నెలలుగా తన వికృత చేష్టలతో ఆ చిన్నారిని లైంగికంగా వేధించేవాడు. అడ్డొచ్చిన భార్యపై దాడి చేసి చంపుతానని బెదిరించేవాడు. భర్త ఆగడాలు రోజు రోజు పెరిగిపోయాయి. దాంతో భరించలేక భార్య అనంతపురం దిశ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa