ఓ మహిళ పూర్తి నగ్నంగా వీధుల్లో తిరుగుతోంది. కొన్ని ఇండ్ల ముందుకు వెళ్లి తలుపులు తడుతోంది. అయితే ఆమె ఇలా ఎప్పటి నుంచి చేస్తుందో తెలియదుగానీ..తాజాగా ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. సీసీ కెమెరాల్లో రికార్డయిన ఈ వీడియోలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాంపూర్ జిల్లాలోని మిలక్ పట్టణంలో ఈ షాకింగ్ వీడియో రికార్డయ్యింది.ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో ఓ మహిళ అర్ధరాత్రి ఒంటిపై దుస్తులు లేకుండా వీధిలోకి వచ్చింది. ఓ ఇంటి ముందుకు వచ్చి ఆగింది. తర్వాత ఆ ఇంటి తలుపు దగ్గరికి వెళ్లి ఆగింది. కాసేపు ఆ ఇంటి తలుపు తట్టింది. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్న ఈ వీడియోను నెటిజన్లు విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు.