బీహార్: వైశాలి జిల్లాలో సీమాంచల్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 9 రైలు బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో ఐదుగురు మృతి చెందారు. మరికొంత మందికి గాయాలయ్యాయి. ఇవాళ తెల్లవారుజామున 3.52 కు బీహార్ రాజధాని పాట్నాకు 30 కిలోమీటర్ల దూరంలో సహదాయ్ బుజుర్గ్‌లో ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైలు ప్రమాద ఘటనపై సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయ చర్యలను వెంటనే ప్రారంభించాలని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఆదేశించారు. బాధితుల సహాయార్థం రైల్వే శాఖ హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa