వైసీపీ అరాచకాలను ప్రజలు తెలుసుకుంటున్నారని మంత్రి సత్య కుమార్ అన్నారు. ఆ విషయాన్ని డైవర్ట్ చేయడానికి వైసీపీ ప్లాన్ చేస్తోందని ఆరోపించారు. ఓడిన రెండు నెలల తరువాత ఈవీఎంలపై అనుమానాలు ఎలా? అని ప్రశ్నించారు. ఈవీఎం ట్యాంపరింగ్స్కు అవకాశమే లేదని మంత్రి అన్నారు. ప్రజా సమస్యలపై స్పందించడం తప్పు అని కొందరు అంటున్నారని.. ఎవరేమి అన్నా ఫిర్యాదుల స్వీకరణ ఆగదని మంత్రి స్పష్టం చేశారు.