ఆలయాల్లో అర్చకుల వేతనం పెంచుతూ సీఎం చంద్రబాబు నిర్ణయించారు. రూ. 10 వేలు వేతనం వచ్చే అర్చకులకు ఇక నుంచి రూ. 15 వేలు వేతనం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అలాగే.. దూపదీప నైవేధ్యాలకు ఇచ్చే మొత్తం రూ. 5 వేలను రూ. 10 వేలకు పెంచారు. నిరుద్యోగ వేద విద్యార్థులకు నెలకు రూ. 3 వేలు బృతి ప్రకటించారు. నాయీ బ్రాహ్మణకులకు కనీస వేతనం రూ. 25 వేలు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం. ఇక సీజీఎఫ్ కింద, శ్రీవాణి ట్రస్ట్ నిధుల ద్వారా జరిగే పనుల్లో ప్రారంభం కాని పనులు నిలిపివేయాలని ఆదేశించారు. దేవాలయ ఆస్తుల పరిరక్షణకు కమిటీలను ఏర్పాటు చేయాలని, పరిశుభ్రత, ప్రసాదంలో నాణ్యత, ప్రశాంత వాతావరణం కనిపించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. అలాగే, సింహాచలం పంచగ్రామాల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలన్నారు.