తణుకు అన్న క్యాంటీన్లో ప్లేట్ల అంశంపై వైసీపీ విష ప్రచారం చేస్తోందని మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. చేతులు కడిగే సింక్లో తినే ప్లేట్లు పడేసింది వైసీపీ మూకలే అని అన్నారు. విషప్రచారం చేసేందుకే సైకో బ్యాచ్ ఈ పనిచేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతులు కడిగే స్థలంలో వైసీపీ మూకలు అన్నం ప్లేట్లు వేసి వీడియో తీశారన్నారు. సింక్లో ఉన్న ప్లేట్లు తీస్తుంటే.. వాటిపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. శుభ్రం చేయని ప్లేట్లను వాడుతున్నారంటూ విమర్శిస్తున్నారని మండిపడ్డారు. అన్న క్యాంటీన్లపై సైకో జగన్ విషం చిమ్మటం కొనసాగిస్తూనే ఉన్నారంటూ లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.