మనం స్నానం చేసేటప్పుడు చెవిలోకి నీరు వెళితే వెంటనే శుభ్రం చేసుకోవాలి. లేకపోతే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. చెవిలో నీరు చేరితే చీము ఏర్పడవచ్చు. రక్తం బయటకు రావచ్చు. చెవి నొప్పి వంటి అనేక సమస్యలు కూడా వస్తాయి. దురద పెరుగుతుంది. నీటిని బయటకు తీసేందుకు పుల్లలు, వేళ్లు, అగ్గిపుల్లలు, బైక్ కీలు పెట్టకూడదు. దీని వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది. సహజ పద్ధతిలో నీరు బయటకు పోయేలా చేయాలి.