తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. లడ్డూలపై ఆంక్షలు విధించింది. ఒకరికి ఒక లడ్డూ మాత్రమే ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది. ఆధార్ కార్డు ఉంటేనే భక్తులక అదనపు లడ్డూ ఇస్తారని అధికారులు తెలిపారు.లేకుంటే ఒక భక్తుడికి ఒక లడ్డూ మాత్రమే ఇచ్చేలా డెసిషన్ తీసుకోవడంతో లడ్డూల కోసం భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.నెల రోజులు...తిరుమల వెళ్లిన వారు వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న తర్వాత అందరికీ అత్యంత ప్రియమైన లడ్డూలను తీసుకుంటారు. ఇప్పటి వరకూ డబ్బులు చెల్లిస్తే ఒక్కొక్కరికి ఎన్ని లడ్డూలైనా ఇస్తారు. కానీ లడ్డూల తయారీలో ఇబ్బందులు, రోజుకు లక్షల్లో మంది భక్తులు వచ్చి లడ్డూలు తీసుకుంటారు. ఒక భక్తుడికి నెల రోజులు తర్వాత మాత్రమే రెండోసారి లడ్డూను విక్రయిస్తారు. టీటీడీ ఈ నిర్ణయంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.