రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరం బీద మస్తాన్ మీడియాతో మాట్లాడుతూ.. తన సోదరుడు బీద రవిచంద్ర కూడా టీడీపీలోనే ఉన్నాడన్నారు. చైర్మన్ ఫార్మాట్లోనే రాజీనామా చేశానన్నారు. రాబోయే రాజకీయ భవిష్యత్తుపై కుటుంబ సభ్యులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. చంద్రబాబు నాయుడు కలిశారని బీద మస్తాన్ రావును అడగ్గా... గతంలో చంద్రబాబు నాయుడు మా బాస్ అని సమాధానమిచ్చారు. వ్యక్తిగత కారణాల వల్ల స్వచ్ఛందంగా రాజీనామా చేశానని బీద మస్తాన్ రావు తెలిపారు.