రాజ్యసభ పదవికి, వైసీపీకి మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావులు రాజీనామా చేశారు. పార్లమెంట్‌లో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌కు రాజీనామా పత్రాలను ఇరువురూ అందజేశారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా పత్రాలను అందజేశారు. అనంతరం వైసీపీకి సైతం రాజీనామా చేశారు. ఇద్దరు ఎంపీల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మోపిదేవి కుడి భుజంలా వ్యవహస్తే.. బీద మస్తాన్ రావుపార్టీలో కీలక వ్యవహరించారు. ఇప్పుడు వీరిద్దరూ పార్టీకి రాజీనామా చేయడంతో కేడర్‌కు ఏం చేయాలో పాలుపోవడం లేదు. నేతలే తమ దారి తాము చూసుకుంటుంటే తమ పరిస్థితేంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఇద్దరూ అటు పదవికి, ఇటు పార్టీకి ఏకకాలంలో రాజీనామా చేశారు. ఈమోపిదేవి, బీద మస్తాన్ రావులు నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. నేటి మధ్యాహ్నం 12:30 గంటలకు రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్‌కు అందజేశారు.