మెనూ పక్కాగా అమలు చేయాలని ఐటీ డీఏ డిప్యూటీ డీఈవో నారాయడు కోరారు. చదువుల్లో వెనుకబడిన పిల్లలను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వ హించాలని సూచించారు. బుధవారం సీతంపేట మండలంలోని చినబగ్గ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల విద్యా ప్రమాణాల స్థాయిని పరిశీలించారు. విద్యార్థుల నోట్, వర్క్‌బుక్స్‌ను ఎప్పటికప్పుడు కరక్షన్ చేస్తుండాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని సూచించారు. విద్యార్థులను ఏ, బీ, సీ,డీ గ్రూప్‌లుగా విడదీసి బోధించాలని తెలిపారు. అనంతరం నుంచి పూతికవలస, గోరపాడు, గూడంగి కాలనీ జీపీఎస్ పాఠశాలలను తనిఖీ చేశారు. కార్య క్రమంలో సీఎంవో చిరంజీవులు పాల్గొన్నారు.