జ్వరం వచ్చిన వెంటనే రక్త పరీక్షలు చేయించుకోవాలని మలేరి యా సబ్-యూనిట్ అధికారి సిద్దయ్య పేర్కొన్నారు. శుక్రవారంలో సింహాద్రిపురం పరిధిలోని మడ గ్రామంలో ఇంటింటా ఫీవర్ సర్వే నిర్వహించి ప్రజలకు మలేరియా, డెంగ్యూ వ్యాధుల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మలేరియా సబ్ యూనిట్ అధికారి సిద్ధయ్య మాట్లాడుతూ.... ఆరోగ్య కార్యకర్తలు ప్రతి గ్రామాన్నీ సందర్శించి జ్వరం వచ్చిన వారికి రక్తపూతలు సేకరించి వారానికి మూడుసార్లు ల్యాబ్‌కు అందజేయాలన్నారు. మలేరియా నిర్ధారణ అయితే వెంటనే చికిత్స అందించాలన్నారు.