తనను గత ప్రభుత్వ పెద్దలు, పోలీస్ అధికారులు ఆటబొమ్మలా వాడుకున్నారని హీరోయిన్ జిత్వాని తెలిపారు. అప్పట్లో తనను చిత్రహింసల గురి చేసిన గత ప్రభుత్వ వ్యక్తులపై కేసు వివరాలను, తన వద్ద ఉన్న సాక్ష్యాలను ఏపీ పోలీసులకు అందజేస్తానన్నారు.ఇప్పుడున్న ఏపీ ప్రభుత్వం తనకు న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉందన్నారు. విజయవాడ పోలీసులు తనతో మాట్లాడారని, ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశానని జిత్వాని చెప్పారు.గురువారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయంలో హీరోయిన్ జిత్వాని మాట్లాడుతూ… ‘అప్పట్లో నన్ను చిత్రహింసల గురి చేసిన గత ప్రభుత్వ వ్యక్తులపై కేసు వివరాలను, నా వద్ద ఉన్న సాక్ష్యాలను ఏపీ పోలీసులకు అందజేస్తాను. ఇప్పుడున్న ఏపీ ప్రభుత్వం నాకు న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉంది. విజయవాడ పోలీసులు నాతో మాట్లాడారు, ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశాను. నాపై 2014లో మల్టిపుల్ క్రిమినల్ కేసులు నమోదు చేశారు. నన్ను గత ప్రభుత్వ పెద్దలు, పోలీస్ అధికారులు అట బొమ్మలా వాడుకున్నారు. చట్ట వ్యతిరేకంగా గత ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు కొందరు నన్ను, నా కుటుంబాన్ని చిత్ర హింసలకు గురిచేశారు. ఈ కేసులో నిందితులకు శిక్ష పడాలి. ఎవరికీ ఇలా జరగకూడదు. ఏపీ ప్రభుత్వం పారదర్శకంగా విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలి. నాపై ఫిర్యాదు చేసిన వ్యక్తులు బయట ప్రశాంతంగా తిరుగుతున్నారు’ అని అన్నారు.
‘ఏపీ పోలీసులు అక్రమ కేసులు పెట్టి అనేక విధాలుగా వేధించారు. నాపై అక్రమ కేసులు పెట్టి వేధించిన అధికారులకు సంబంధించి అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. నా దగ్గర ఉన్న ఆధారాలన్నిటినీ ఏపీ ప్రభుత్వానికి అందిస్తాను. నా కుటుంబ సభ్యులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నాకు సపోర్ట్ చేస్తుందని భావిస్తున్నాను. సోషల్ మీడియాలో కొందరు నాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. డబ్బుల కోసమే మాట్లాడుతున్నానని నా వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారు. నాకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపి న్యాయం చేయాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఏపీ ప్రభుత్వంపై నాకు పూర్తి నమ్మకం ఉంది, నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా’ అని హీరోయిన్ జిత్వాని పేర్కొన్నారు.