విజయవాడ , జక్కంపూడి కాలనీలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌ల ఆగడాలు మితిమీరాయని, వాటిని అరికట్టాలని కాలనీలో మహిళలు గురువారం నిరసన తెలిపారు. కాలనీలో మహిళలు ఒంటరిగా వెళ్లాలన్నా భయపడే పరిస్ధితి ఉందన్నారు. ఒంటరి మహిళలపై గంజాయి మత్తులో దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి బ్యాచ్ ఆగడాలు అరికట్టడంలో పోలీసులు విఫలమవుతున్నారన్నారు. రాత్రివేళల్లో గంజాయి మత్తులో మహిళలను ఇబ్బంది పెడుతున్నారని, తాగుబోతుల వీరంగాలు నిత్యకృత్యంగా మారాయని తెలిపారు. బుధవారం రాత్రి గంజాయి బ్యాచ్ స్ధానిక కేబుల్ ఆఫీ్‌సపై దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేసిందని తెలిపారు. పోలీసు ఉన్నతాధికారులు కాలనీలో పోలీసు పోస్టు ఏర్పాటు చేసి గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లపై కఠిన చర్యలు తీసుకుని శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని కోరారు.