కృష్ణా జిల్లా ,గన్నవరం మండలంలోని కేసరపల్లి, జక్కుల నెక్కలం గ్రామాల్లో జలజీవన్ మిషన్ పనులను పరిశీలించేందుకు కేంద్ర బృందం గురువారం పర్యటించింది. బృంద సభ్యులు కుల్‌శ్రేష్ట, సుధీర్ కుమార్ కేసరపల్లి శివారు దుర్గాపురం, చెంచుల కాలనీల్లో జలజీవన్ మిషన్ నిధులు రూ.20 లక్షలతో ఏర్పాటు చేసిన వాటర్ పైప్‌లైన్‌ను పరిశీలించారు. ప్రతి ఇం టికి నీటి కనెక్షన్ ఉందా లేదా, స్వచ్ఛమైన నీరు అందుతోందా.. లేదా? అని ఆరాతీశారు. అంగన్వాడీలు, పాఠశాలలను సందర్శించి అక్కడ మంచినీటిని పరీక్ష చేశారు. వాటర్ ఫిల్టర్ బెడ్లు చూశారు. పంచాయ తీ కార్యాలయంలో సర్పంచ్ చేబ్రోలు లక్ష్మీ మౌనికతో సమావేశమై గ్రామంలో జనాభా ఎంత మంది, వాటర్ కనెక్షన్లు అందరికీ ఉన్నా యా లేదా అని ఆరాతీశారు. ఆర్‌డబ్ల్యుఎస్ ఏఈ కె.సుజాత పాల్గొ న్నారు. జక్కులనెక్కలంలో పైపులైన్లు, తాగునీటిని పరిశీలించారు.