రోడ్డు ప్రమాదాలను నిర్మూలించాలనే లక్ష్యంతో ద్విచక్ర వాహనం నడిపే ప్రతీ ఒక్కరు హెల్మెట్ ధరించాలని కోరుతూ రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో కాకినాడలో గురువారం సాయంత్రం పోలీసులు బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని కాకినాడ ఎస్పీ కార్యాలయం నుంచి ప్రారంభించి సర్పవరం మీదుగా భానుగుడి జంక్షన్, బాలాజీ చెరువు వరకు పోలీసులు నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డుపై ప్రధాన సెంటర్లలో హెల్మెట్ ధరించి ప్రయాణిస్తున్న కొంతమంది వాహనదారులకు బహుమతులు ప్రదానం చేసి అభినందించారు. ఈ ర్యాలీలో ఎస్డీపీవో రఘువీర్ విష్ణు, ట్రాఫిక్ సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.