రాజమహేంద్రవరంలో ఉమెన్ క్రికెట్ అకాడమి ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఎస్‌కేవీటి కళాశాల ఆవరణలో గురువారం నిర్వహించిన జాతీయ స్పోర్ట్స్‌డే వేడుకలకు హాజరై మాట్లాడారు. ధ్యాన్‌చంద్ సారథ్యంలో భారత హాకీ జట్టు మూడు సార్లు ఒలింపిక్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించారని గుర్తుచేసారు. ధ్యాన్‌చంద్‌ను ఆదర్శంగా తీసుకుని నేటి యువ క్రీడాకారులు క్రీడల్లో రాణించాలన్నారు.రాజమహేంద్రవరాన్ని స్పోర్ట్స్ హబ్‌గా మారుస్తామన్నారు. మల్టీపర్సస్ ఇండోర్ స్టేడియం నిర్మించి తీరుతామన్నారు. అనంతరం పలువురు క్రీడాకారులకు సర్టిఫికెట్లు ప్రధానం చేశారు. తొలుత భారత హాకీ లెజెండర్ మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.