జిల్లావ్యాప్తంగా ఉన్న నాలుగు లక్షలకు పైగా డ్వాక్రా సంఘాల మహిళలతో మెక్కులు నాటించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. వనమహోత్సవం ద్వారా వారందరితో ఒక్క రోజు మెుక్కలు నాటే కార్యక్రమం నిర్వహించి నాలుగు లక్షలకుపైగా నాటిస్తామని చెప్పారు. ప్రతి పాఠశాల, కళాశాలలోనూ కచ్చితంగా మూడు మొక్కలు నాటాలని ప్రతిపాదన చేసి యాజమాన్యాలు అమలు చేయాలని సూచించారు. ప్రతి ఇంట్లోనూ విద్యార్థులు చెట్లు పెంచడంపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడుతోపాటు ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, సుందరపు విజయ్ కుమార్, కలెక్టర్ విజయ కృష్ణన్ పాల్గొన్నారు.