గుడివాడలోని గుడ్లవల్లేరు కాలేజ్ హాస్టల్ అనుమానుష ఘటన జరిగింది. హాస్టల్‌లోని అమ్మాయిల బాత్రూమ్‌లలో సీక్రెట్ కెమెరాలు ఉన్నట్లు గుర్తించారు.ఆ కెమెరాలు పెట్టింది బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న విజయ్ కుమార్ అనే విద్యార్థి అంటూ ఆరోపించారు. అతనిపై మూకుమ్మడిగా దాడి చేసేందుకు యత్నించారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు వెంటనే విజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. తమకు న్యాయం జరగాలంటూ నిన్న రాత్రి నుంచి ఆడపిల్లలు టార్చ్ లైట్లు పట్టుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు.
అయితే.. ఇక్కడ కెమెరాలు బాత్రూమ్‌లలో పెట్టింది విజయ్ కుమార్ కాదు. ఒక అమ్మాయి. ఇదే కాలేజ్‌లో చదువుతున్న ఓ యువతి విజయ్ కుమార్ ప్రేమించుకున్నారు. వీరిద్దరూ ఓరోజు ఓయోకు వెళ్లారు. ఆ సమయంలో విజయ్ తమ రాసలీలలను రికార్డ్ చేసి తన స్నేహితులకు షేర్ చేసాడు. దాంతో వారు విజయ్ ప్రేయసిని బెదిరించడం మొదలుపెట్టారు. ఈ వీడియో బయటికి రాకుండా ఉండాలంటే కాలేజ్ హాస్టల్‌లోని అమ్మాయిల నగ్న ఫోటోలు, వీడియోలు కావాలని డిమాండ్ చేసారు. ఇదే విషయం ఆ అమ్మాయి విజయ్‌కి చెప్పగా అతను సీక్రెట్ కెమెరాలు పెట్టాలని ఐడియా ఇచ్చాడు. అలా ఆ అమ్మాయి విద్యార్థినులు వాడే బాత్రూమ్‌లలో సీక్రెట్ కెమెరాలు పెట్టిందని మరో ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పుడు పోలీసులు విజయ్‌తో పాటు ఆ అమ్మాయిని కూడా ప్రశ్నిస్తున్నారు.
ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించారు. హస్టల్ లో రహస్య కెమెరాలు ఉన్నాయనే విద్యార్థినుల ఆందోళనపై విచారణ జరపాలని సీఎం ఆదేశించారు. తక్షణమే జిల్లా మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీ లను ఘటనా స్థలానికి వెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశించారు