అనంతపురం జిల్లా గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయ ఆవరణంలో మహిళలు సామూహిక వరలక్ష్మీ వ్రతము చేశారు.
ముందుగా ఆలయంలో వేకువ జామున స్వామివారి మూలమూర్తికి సుగంధర్వాలు, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఈఓ భద్రాజి, ఆలయ ధర్మకర్త సుగుణమ్మ పాల్గొన్నారు.