ఒత్తిడి, ఆందోళనకు గురైనప్పుడు పైపైనే శ్వాస తీసుకోవడం వల్ల శరీరంలో వాయువుల సమతుల్యత దెబ్బతింటుంది. దీన్నుంచి వెంటనే బయటపడటంతో పాటు రాత్రులు నిద్ర మెరుగ్గా పట్టేందుకు వైద్య నిపుణులు 4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ ను సూచిస్తారు.
ఇందులో భాగంగా కూర్చొని లేదా పడుకొని 4 సెకన్ల పాటు లోతుగా ఊపిరి తీసుకొని, 7 సెకన్ల పాటు దాన్ని బిగపట్టి, తర్వాత 8 సెకన్ల పాటు నెమ్మదిగా నోటి ద్వారా శ్వాసను వదిలిపెట్టాలి.