ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీకి గడ్డుకాలం ఎదురవుతుంది. పార్టీ నుంచి ఒక్కొక్కరూ జారుకుంటుండడంతో ఆ పార్టీలో అయోమయపరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ నుంచి మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామా బాట పట్టనున్నారు. కర్రిపద్మశ్రీ , బల్లి కల్యాణ్ చక్రవర్తి అనే ఇద్దరు ఎమ్మెల్సీలు శుక్రవారం సాయంత్రంలోగా తమ పదవులకు రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ఎమ్మెల్సీ పదవులతో పాటు వైసీపీకి రాజీనామాచేయనున్నారు.నిన్న వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు ఎంపీ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్‌లో రూపొందించి రాజ్యసభ చైర్మన్ ధన్‌కడ్ జగదీప్‌కు అందజేశారు. తాను టీడీపీలో చేరుతున్నట్లు వెంకటరమణ ప్రకటించగా , కుటుంబ సభ్యులతో మాట్లాడి త్వరలో నిర్ణయం తీసుకుంటానని మస్తాన్‌రావు వెల్లడించారు.32 సంవత్సరాల పాటు టీడీపీలో కొనసాగిన మస్తాన్‌రావు వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీకి రాజీనామా చేశారు. కాగా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్, మరికొందరు మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్ల వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ, బీజేపీ, జనసేనలో చేరారు.