భక్తి శ్రద్ధలతో ఆనందోత్సవాలు మధ్య నిర్వహించే వినాయక చవితి ఉత్సవాలు వలన ఎదుటి వారికి ఇబ్బందులు కలగ కూడదని ఆసౌకర్యం కలిగేలాగా శబ్ద కాలుష్యాలు వినాయక చవితి ఉత్సవ కమిటీ వారు చేయకుండగా ఆనందోత్సవాల, భక్తి భావాలతో నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ కె ప్రతాప్ కిషోర్ ఐపీఎస్ వారు వినాయక ఉత్సవ కమిటీల వారు పోలీస్ వారి యొక్క అనుమతి కొరకు http//GaneshUtsov.net కు గాని ఫోన్ నెంబర్ 7995095800 వాట్స్ ఆఫ్ కి Hi అని టైప్ చేసిన తరువాత మీ యొక్క ఫోన్ చేసిన వారికి లింక్ వస్తుంది అని, లింక్ పై క్లిక్ చేసిన తరువాత మీకు OTP వస్తుంది ఆ తరువాత అప్లికేషన్ కొరకు గూగుల్ ఫారం ఓపెన్ చేసి అందులో ఉన్న కాలమ్స్ ను పూర్తి చేసి సబ్మిట్ చేయాలి అని అనంతరం మీకు పోలీస్ వారు వెర్ఫీ చేసిన అనంతరం సింగిల్ విండో పద్ధతి ప్రకారం పర్మిషన్ మంజూరు అవుతుందని, వినాయక మండపాలు వద్ద కమిటీ వారు నిర్వహించవలసిన విషయాలపై జిల్లా ఎస్పీ గారు కొన్ని సూచనలు మరియు ఆదేశాలు ఇచ్చినారు
1.వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించే కమిటీ సభ్యులు ముందుగా సంబంధిత పోలీసు అధికారుల యొక్క అనుమతిని తీసుకోవాలని,
2. ఉత్సవ విగ్రహాలను రోడ్డుకు అంతరాయం లేకుండా ట్రాఫిక్కు ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసుకోవాలని
3. వినాయక చవితి మండపాల వద్ద ఎక్కువ శబ్ద కాలుష్యం చేసే స్పీకర్లను ఉపయోగించరాదని, స్పీకర్లను ఉదయం 6.00 గంటల నుండి రాత్రి 10.00 గంటల వరకు మాత్రమే వినియోగించాలని,
4. ఉత్సవ కమిటీ సభ్యులు ఉత్సవ మండపాల వద్ద భక్తుల యొక్క క్యూ లైన్ లను పాటించే విధముగా చూడవలసిన బాధ్యత ఉత్సవ కమిటీ వారిదేనని,
5. ఉత్సవ మండపాలు వద్ద విగ్రహాలకు భద్రతగా కమిటీ సభ్యులు రాత్రులు మండపాలు వద్దనే ఉండాలని
6. వినాయక నిమజ్జనం చేసే సమయాలను మరియు రూట్ మ్యాప్ ను ముందుగా పోలీసు వారికి తెలియ చేయాలి అని,
7. వినాయక చవితి మండపాల వద్ద ట్రాఫిక్ కు ఎటువంటి అంతరాయం కలగకుండా వాహనాలను ఒక ప్రక్కగా పార్కింగ్ చేసేలాగా ఏర్పాట్లను కలగా చేయాలి అని,
8. ఉత్సవ మండపాలలో మండే స్వభావం కలిగినటువంటి వాటితో జాగ్రత్తలు తీసుకుంటూ విద్యుత్ అలంకరణల పట్ల తగిన జాగ్రత్తలు వహించి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని
9. ఉత్సవ కమిటీలు ఉత్సవ పందిర్లను ఏర్పాటు చేసుకునే విషయాలలో సంబంధిత అధికారులు యొక్క అనుమతిని పొందాలని,
10. వినాయక ఉత్సవ మండపాల వద్ద గాని ఊరేగింపులలో గాని బాణసంచాను ఉపయోగించరాదని,
11. వినాయక నిమజ్జనం సమయంలో ఆశీల డాన్సులను గాని డీజే శబ్దాలు కలిగే వాడుకుని నిరోధించాలని,
వినాయక చవితి ఉత్సవాల నిర్వాహకులకు ఏలూరు జిల్లా పోలీస్ యంత్రాంగం సహాయ సహకారాలను అందిస్తుందని ఉత్సవ కమిటీ సభ్యులు అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ సూచించే సూచనలు ఆదేశాలను పాటించి ఆనందంగా ఉత్సవాలను నిర్వహించుకోవాలని,
*వినాయక చవితి విగ్రహాలను ఏర్పాటు చేసే కమిటీ వారు అన్ని శాఖల యొక్క అనుమతులు తప్పనిసరి అని, అనుమతుల సులభతరం చేయడానికి కోసం ప్రభుత్వం వారు సింగిల్ విండో విధానాన్ని సిద్ధం చేస్తోంది
*పెద్ద విగ్రహాలను ఏర్పాటు చేసే మండపాలు వద్ద తప్పనిసరిగా తాత్కాలిక CCTV la నిఘా మరియు పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేయాలి అని జిల్లా ఎస్పీ గారు ఈ ప్రకటన ద్వారా తెలియ చేసినారు*