సెప్టెంబర్ నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు ఉన్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ అంశాల ఆధారంగా సెలవులు ఉంటాయి. అయితే.. సెప్టెంబర్ 7న వినాయక చవితి, 16న ఈద్ ఏ మిలాద్ సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకూ సెలవులు ఉన్నాయి. మరోవైపు 1, 8, 15, 22, 29 న ఆదివారాలు కారణంగా సెలవు. కాగా, 14, 28 న రెండు, నాలుగు శనివారాల కారణంగా సెలవు. దేశవ్యాప్తంగా వీటన్నింటితో కలిపి సెప్టెంబర్ నెలలో 15 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు.