ఏపీలో వైరల్ ఫీవర్లు విజృంభిస్తున్నాయి. 10 రోజుల్లో సుమారు 5 లక్షల మంది బాధితులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో జాయిన్ అవుతున్నాయి. అనధికారిక లెక్కల ప్రకారం ఈ సంఖ్య మరింత ఎక్కువే ఉంటుందని టాక్ వినిపిస్తోంది. గతేడాది కంటే ఈసారి బాధితుల సంఖ్య 20-30 శాతం ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా కేసులు భారీగా నమోదవుతున్నాయి.