ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ప్రజలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తోంది,మొగల్రాజపురం సున్నబట్టీల సెంటర్ వద్ద గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి.. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా మరి కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి.. సమాచారం తెలుసుకున్న వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించడం జరిగింది.మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్,మల్లాది విష్ణు,5వ డివిజన్ కార్పొరేటర్ కలపాల అంబెడ్కర్ కూడా ఆ కుటుంబాలను ఓదార్చారు.. అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని వెంటనే సహాయక చర్యలు వేగవంతం చేయాలని కోరడం జరిగింది.ప్రజా ప్రతినిధుల అలసత్వం వల్లనే ఈ ఘటన జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.. వర్షాలు పడుతాయన్న సమాచారం ఉన్నప్పటికీ అధికార పక్ష నేతలు ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని గతంలో ఇంతకన్నా ఎక్కువ వర్షాలు పడిన ఎటువంటి ఘటనలు జరగలేదని అన్నారు.. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.. గాయపడిన వారికి మంచి వైద్యం అందించి వారి కుటుంబాలకు అండగా నిలవాలని కోరారు. శిధిలాల కింద ఎవరైనా చిక్కుకుని ఉంటే వారు సురక్షితంగా బయటపడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.వైసీపీ శ్రేణులు కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.. వైసిపి హయాంలో సచివాలయం సిబ్బంది,, వాలంటీర్ల ద్వారా ముందుగానే కొండ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసే వాళ్ళమని గుర్తు చేశారు.మోటార్లు పెట్టీ నిలువ ఉన్న వర్షపు నీరును తోడే వాళ్ళమని ఇప్పుడు ఆ పరిస్థితి కనపడటం లేదన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని ఆయన డిమాండ్ చేశారు.