నూజివీడు దగ్గర పెద్ద చెరువుకు భారీగా గండి పడటంతో, ఒకేసారి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చి, ఊహించని విధంగా వచ్చిన వరదల్లో పలు గ్రామాల ప్రజలు చిక్కుకున్నారు. సమాచారం రావటంతో వెంటనే రంగంలోకి దిగిన యంత్రాంగం, NDRF, SDRF, ఫైర్ సిబ్బందితో కలిసి ఆపరేషన్ మొదలు పెట్టారు. జిల్లా ఎస్పీ కిషోర్ దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షించారు. మంత్రి పార్ధసారధి పలు మార్లు ఘటనా స్థలానికి చేరుకొని సమీక్షించారు. ప్రభుత్వం, అధికారులు సకాలంలో స్పందించటంతో ప్రాణ నష్టం జరగకుండా, అందరినీ కాపాడి పునరావాస కేంద్రాలకు తరలించారు.