విశాఖ నగరం వన్ టౌన్ ప్రాంతంలో గల కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఈనెల 7వ తేదీ నుంచి 15 వరకు వాసవి వరసిద్ధి వినాయక మహోత్సవాలను వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ సంఘం అద్యక్ష కార్యదర్శులు ఏ దినకర్, పి కామరాజు తెలిపారు. ఈ మేరకు ఆదివారం గోడపత్రికను దేవాలయంలో వారు ఆవిష్కరించారు. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం వినాయకునికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa