వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి. ప్రణాళిక లోపంతోనే ఈ సమస్యలన్న ఎమ్మెల్యే గళ్ళా మాధవి. మోటార్ల సాయంతో నీళ్లు తోడాలని అధికారులకు ఆదేశాలు. రోజంతా నియోజకవర్గంలో పర్యటించి,బాధితులకు అండగా ఉంటామన్న ఎమ్మెల్యే. శుక్రవారం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాలయిన శ్రీనివాసరావు పేట, శాంతి నగర్, లక్ష్మి నగర్, రామిరెడ్డి నగర్, 60అడుగుల రోడ్డు, గౌతమి నగర్, ముత్యాల రెడ్డి నగర్, అంబేద్కర్ నగర్, కొబాల్డ్ పేట, దేవాపురం, పట్టబిపురం, వడ్డే గూడెం, చుట్టగుంట, కే.వి.పి కాలనీ, ఏటి అగ్రహారం, హౌసింగ్ బోర్డు కాలనీ, నల్లచెరువు ప్రాంతాల్లో ఎమ్మెల్యే గళ్ళా మాధవి పర్యటించారు. ఏటి అగ్రహారం ప్రధాన రోడ్డులో మోకాళ్ళ లోతు నీటిలో నడుస్తూ, నీళ్లు చేరిన ఇళ్లలోకి వెళ్లి ప్రజల్ని పరామర్శించారు. ఇంత భారీగా నీరు చేరటానికి ప్రణాళిక లోపమే ప్రధాన కారణమని, వెంటనే అధికారులు నీటిని తొడటానికి అవసరమయ్యిన యంత్రాలను ఉపయోగించి నీటిని తోడాలని ఆదేశించారు. అదేవిధంగా దేవాపురంలో సైడు కాలువలను ఆక్రమించి, నిర్మాణాలు చేపట్టటం వలన నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడి ఇళ్లలోకి నీరు చేరినట్లు ఎమ్మెల్యే గుర్తించి,వెంటనే ఈ ఆక్రమణలను గుర్తించి, తొలగించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా నల్ల చెరువులో సరయిన డ్రైనేజీ నిర్మాణాలు లేకపోవటం వలనే ఈ పరిస్థితి వచ్చిందని, గత పాలకులు, అధికారులు ఎందుకు వీటి మీద దృష్టి పెట్టలేదని ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ.... తాను ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి డ్రైనేజి మరియు సిల్టేషన్ తొలగింపు మీద దృష్టి పెట్టానని, సిబ్బంది కొరత మరియు ఇతర కారణాలతో ఆశించిన స్థాయిలో పనులు జరగలేదని తానూ భావిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. శానిటేషన్ విషయాన్ని తానూ సిరియస్ గా తీసుకుంటున్నానని, ఇప్పటికే ఈ విషయాన్ని నగర మునిసిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లానని ఎమ్మెల్యే తెలిపారు. గత మునిసిపల్ కౌన్సిల్ సమావేశాల్లో అన్ని డివిజన్ లలో సైడ్ డ్రైన్ల నిర్మాణాలు చేపట్టాలని ప్రతిపాదించానని, లోతట్టు ప్రాంతాల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోబోతున్నట్లు గళ్ళా మాధవి తెలిపారు. నిన్నటి నుండి ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను, అధికారులు అందరు సమన్వయ పరుచుకుంటూ, ఎప్పటికప్పుడు పరిష్కరించేలా అన్ని శాఖల అధికారులతో తానూ ఎప్పటికప్పుడు సమీక్షలు జరిపి, అధికారులకు ఆదేశాలు జారీ చేసానని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. నిన్నటి నుండి ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను, అధికారులు అందరు సమన్వయ పరుచుకుంటూ, ఎప్పటికప్పుడు పరిష్కరించేలా అన్ని శాఖల అధికారులతో తానూ ఎప్పటికప్పుడు సమీక్షలు జరిపి, అధికారులకు ఆదేశాలు జారీ చేసానని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉన్నారని ప్రజలకు భరోసానిచ్చారు