బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారటంతో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షపాతం నమోదవుతోంది. అందులోనూ ఆంధ్రప్రదేశ్‌లో చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా చాలా రైళ్లను రద్దు చేసినట్లు విజయవాడ డీఆర్ఎం ప్రకటించారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు తెలిపారు. ఈ మేరకు విజయవాడ డీఆర్ఎం ఓ ప్రకటన విడుదల చేశారు. నేటి నుంచి మూడు రోజుల పాటు మొత్తంగా 20 రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రయాణికుల భద్రతా కారణాల దృష్ట్యా రైళ్లను రద్దు చేసినట్టు వివరించారు.
రద్దయిన రైళ్లు వివరాలివిగో..
సెప్టెంబర్ 01న- విజయవాడ టూ తెనాలి (07279)
సెప్టెంబర్ 01న- తెనాలి టూ విజయవాడ (07575)
సెప్టెంబర్ 01న- గూడూరు టూ విజయవాడ (07458)
సెప్టెంబర్ 01న- తెనాలి టూ రేపల్లె (07874)
సెప్టెంబర్ 01న- రేపల్లె టూ తెనాలి (07874)
సెప్టెంబర్ 01న- గుడివాడ టూ మచిలీపట్నం (07868)
సెప్టెంబర్ 01న- మచిలీపట్నం టూ గుడివాడ (07869)
సెప్టెంబర్ 01న- భీమవరం జంక్షన్ టూ నిడదవోలు (07885)
సెప్టెంబర్ 01న- నిడదవోలు టూ భీమవరం జంక్షన్ (07886)
సెప్టెంబర్ 01న- నర్సాపూర్ టూ గుంటూరు (07281)
సెప్టెంబర్ 01న- గుంటూరు టూ రేపల్లె (07784)
సెప్టెంబర్ 01న- రేపల్లె టూ గుంటూరు (07785)
సెప్టెంబర్ 01న- గుంటూరు టూ విజయవాడ (07976)
సెప్టెంబర్ 01న- విజయవాడ టూ నర్సాపూర్ (17269)
సెప్టెంబర్ 01న- ఒంగోలు టూ విజయవాడ (07576)
సెప్టెంబర్ 01న- విజయవాడ టూ మచిలీపట్నం (07898)
సెప్టెంబర్ 01, 02 తేదీల్లో- మచిలీపట్నం టూ విజయవాడ (07899)
సెప్టెంబర్ 01, 02 తేదీల్లో- విజయవాడ టూ ఒంగోలు (07461)
భారీ వర్షాల నేపథ్యంలో ప్రయాణికుల సందేహాల నివృత్తితో పాటు సమాచారం తెలుకునేందుకు గానూ.. విజయవాడ డివిజన్‌లో హెల్ప్‌లైన్ నెంబర్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రయాణికులు ఆ హెల్ప్ లైన్ నెంబర్లకు ఫోన్ చేసి రద్దయిన రైళ్ల సమాచారాన్ని.. మళ్లీ ఎప్పుడు పునరుద్ధరించనున్నారన్న వివరాలను అడిగి తెలుసుకోవచ్చని రైల్వే అధికారులు సూచించారు. ఇదే విధంగా.. దక్షిణ మధ్య రైల్వే కూడా ప్రయాణికుల సౌకర్యార్థం హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది.
విజయవాడ డివిజన్ హెల్ప్ లైన్ నంబర్లు..
విజయవాడ- 7569305697
రాజమండ్రి -08832420541
తెనాలి -08644-227600
తుని -7815909479
నెల్లూరు- 7815909469
గూడూరు- 08624-250795
ఒంగోలు -7815909489
గుడివాడ- 7815909462
భీమవరం- టౌన్ 7815909402
దక్షిమ మధ్య రైల్వే హెల్ప్ లైన్ నంబర్లు
హైదరాబాద్ - 27781500
సికింద్రాబాద్- 27786140, 27786170
కాజీపేట-27782660, 8702576430
వరంగల్ - 27782751
ఖమ్మం - 27782985, 08742-224541, 7815955306
విజయవాడ - 7569305697
రాజమండ్రి -0883-2420541, 0883-2420543
గుంటూరు -9701379072
నరసరావుపేట -9701379978
నల్గొండ -9030330121
మిర్యాలగుడా- 8501978404
నంద్యాల -7702772080
దొనకొండ -7093745898
నడికుడి -7989875492
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa