రాజస్థాన్‌లోని బర్మేర్ సమీపంలో వాయుసేనకు చెందిన మిగ్-29 యుద్ధ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదం నుంచి పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. జెట్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు.
వైమానిక దళానికి యుద్ధ విమానాల పైలట్లకు రాత్రివేళ రోజువారీ శిక్షణలో భాగంగా మిగ్-29ను నడుపుతుండగా సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే పైలట్ కిందికి దూకగా, విమానం క్షణాల్లో తగలబడిపోయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa