సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా వ్యవహరించాలని ఎస్. కోట మండలం వినాయక పల్లి పంచాయతీ కార్యదర్శి సంతోష్ మంగళవారం తెలిపారు. గ్రామంలో త్రాగునీరు సరఫరా అవుతున్న పైపులైన్ల మరమ్మతుల కార్యక్రమాన్ని సిబ్బందితో ఆయన చేపట్టారు. గ్రామంలో సురక్షిత మంచినీరు సరఫరా లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. కాచి వడబోసిన నీరు త్రాగాలని ప్రజలకు సూచించారు.