జామి మండలం అప్పన్నపాలెంలో ఏవో కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామీణ విత్తనోత్పత్తి పై మంగళవారం రైతులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా వనరుల కేంద్రం సహాయ వ్యవసాయ సంచాలకులు భారతి మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న విత్తనాలపై ఆధారపడకుండా పాత పద్ధతిలో విత్తనోత్పత్తి చేసుకుని తద్వారా అధిక దిగుబడులు సాధించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.