విజయవాడ ప్రాంతంలో వరదల్లో చిక్కుకున్న బాధితులకు జీవీఎంసీ సహాయ సహకారాలు అందించాలని జీవీఎంసీ కార్పొరేటర్ జనసేన నాయకుడు పీతల మూర్తి యాదవ్ విజ్ఞప్తి చేశారు.
మంగళవారం మద్దిలపాలెంలో మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా నాయకులు ప్రతినిధులు ఒక్క అడుగు ముందుకు వేసి విజయవాడలో సహాయ కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. హుద్ హూద్ తుఫానులో ఇతర ప్రాంతాల నుంచి అధికారులు ప్రజాప్రతినిధులు విశాఖ వచ్చి సహకారం అందించారన్నారు.