ప్రభుత్వం ఒప్పంద జీవోలు విడుదల చేయాలని, జీవోల విడుదల వరకు ఆశాల రిటైర్మెంట్ను ఆపాలని ఏపీ ఆశ వర్కర్స్ పార్వతీపు రం జిల్లా అధ్యక్షురాలు కె.గౌరీశ్వరి డిమాండ్ చేశారు. పాలకొండ పట్టణంలోని యూపీ హెచ్ వద్ద మంగళవారం ఆశ వర్కర్లు ధర్నా నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని యూపీహెచ్ వైద్యాధికారికి అందించారు. ఈసందర్భంగా గౌరీశ్వరి మాట్లాడుతూ కలకత్తా ట్రైనీ విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని, మహిళా రక్షణ చట్టం చేయాలని కోరారు. వర్క్‌ప్లేస్‌లో లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పట్టణంలో ఆశ వర్కర్లు ఖాళీలు భర్తీ చేయాలని, ఏఎన్ఎం ఖాళీలు భర్తీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో ఆశ వర్కర్లు శాంతి, ధనలక్ష్మి, శ్రీదేవి, రాధారాణి పాల్గొన్నారు.