ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యువతకి అండగా నిలుస్తాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 04, 2024, 07:19 PM

రానున్న ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. పార్వతీపురం స్థానిక శ్రీవేంక టేశ్వ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మంగళ వారం జరిగిన జాబ్‌మేళా కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపా ధి కల్పించాలనే సంకల్పంతో ఉందన్నారు. ఈ జాబ్‌మేళాలో వనిత ల్యాబ్స్‌, మంజు శ్రీ, టెక్నోప్యాక్‌, కెఎల్‌ గ్రూప్‌, అమోజాన్‌ సంస్థల్లో ఉద్యోగాల కోసం 205 మంది ఇంటర్వ్యూల్లో పాల్గొనగా 89 మందిని ఎంపిక చేసినట్లు జిల్లా నైపుణ్యాభి వృద్ధి సంస్థ సాయికుమార్‌ తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌వీడీ కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ శాంతి కుమారి, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి రమేష్‌, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com