సత్యసాయి తాగునీటి కార్మికుల బకాయి జీతాలు తక్షణమే చెల్లించాలని, ముదిగుబ్బ మండలంలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని సీపీఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు పేర్కొన్నారు. మంగళవారం సత్యసాయి తాగునీటి కార్మికులు, స్థానికులతో కలిసి సీపీఐ ఆధ్వర్యలో ఖాళీ బిందెలతో మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ కూడలిలో రోడ్డుపై ధర్నా నిర్వహించారు. అనంతరం తహసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో సత్యసాయి తాగునీటి కార్మికులు, సీపీఐ నాయకులు పాల్గొన్నారు.