భారీ వర్షాలు, వరదలకు రైతులు నష్టపోకుండా పంట కాల్వలు, డ్రెయినేజీలు వేసవి నాటికి ఆధునికీకరిస్తామని శాసన మండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ అన్నారు. నరసాపురం మండలంలోని నీట మునిగిన పంట పొలాలను టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పొత్తూరి రామరాజు, కొవ్వలి నాయుడులతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం షరీఫ్ విలేకర్లతో మాట్లాడుతూ ఐదేళ్ళకాలంలో పంట కాల్వలో పూడిక పనులను వైసీపీ ప్రభుత్వం చేపట్టలేదన్నారు. ఈ సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పనులు జరిగేలా చూస్తామన్నారు. అనంతరం ఇన్‌చార్జి పొత్తూరి రామరాజు, టీడీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొవ్వలి నాయుడు మాట్లాడుతూ తక్షణం నియోజకవర్గం లోని మురికికాల్వలను సర్వే చేసి ఆధునీకరణ జరిగేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామన్నారు. వాతాడి ఉమా, జక్కం శ్రీమన్నారాయణ, ముక్కు బాబూరావు, ఆకన సుబ్రహ్మణ్యం, వీరస్వామి, సంకు భాస్కర్, మల్లాడి మూర్తి తదితరులు పాల్గొన్నారు.