తమ్మిలేరు వరద ప్రవాహం తగ్గడంతో ఏలూరు నగర వాసులు, కొల్లేరు పరివాహక ప్రాంత లంక గ్రామాల ప్రజలు ఊపి రిపీల్చుకున్నారు. నాలుగు రోజుల నుంచి కురిసిన వర్షాల కు వరద నీరు తమ్మిలేరు వాగు ద్వారా రావడంతో శనివారపుపేట కాజ్‌వేపై నుంచి నీరు ప్రవహించింది. రెండు రోజుల పాటు ఆ కాజ్‌వేపై రాకపోకలు నిలిపి వేశారు. మంగళవారం ఉదయం వరద నీరు తగ్గడంతో వాహనాల రాకపోకలకు పోలీసులు అనుమతించారు. బ్రిడ్జి కొద్ది భాగం దెబ్బతింది. సిమెంటు దిమ్మ విరిగిపోయి రోడ్డు భాగం కొంత పాడైపోయింది. ముందుస్తుగా పోలీసులు ఆ ప్రాంతంలో ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా స్టాపర్లను ఏర్పాటు చేశారు.