తిరుపతి పరిధిలోని గాజుల మండ్యం స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కె. బాలాజీతో పాటు ఇద్దరు హోంగార్డులపై సస్పెన్షన్ వేటు పడింది.చైనా దేశీయుడికి వీసా గడువు పూర్తయినా ఇక్కడే నివాసముండడంపై 2021లో రేణిగుంట అర్బన్ పోలీసులు కేసు నమోదుచేశారు.అయితే చైనీయుడికి సహాయం చేస్తానంటూ బాలాజీ అతడి వద్దనుంచి రూ. 2లక్షలు తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. దీంతో అతడిని సస్పెండ్ చేస్తూ ఎస్పీ తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. తిరుపతి రూరల్ పోలీస్టేషన్‌లో పనిచేస్తున్న హోంగార్డు గిరి ఇసుక, కంకర రవాణా చేస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ల నుంచి అక్రమ వసూళ్ళకు పాల్పడుతున్నాడని విచారణలో నిరూపణ కావడంతో అతడిని సస్పెండ్ చేశారు.అలిపిరి స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు రాజ్‌కుమార్ ఇతరుల మొబైల్ ఫోన్ల నుంచి ఉన్నతాధికారులకు తోటి సిబ్బందిపై లేనిపోని ఆరోపణలు చేస్తుండడం గమనించి అతడిని సస్పెండ్ చేశారు. వీరిపై సమగ్ర విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఎస్పీ సుబ్బరాయుడు చెప్పారు.
![]() |
![]() |