ప్రజలు తమ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర సూచించారు. పార్వతీపురం మండలంలోని ఎంఆర్‌నగరం సచివాలయం వద్ద జెమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.... ఆరోగ్యం పట్ల ప్రతిఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు. రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఈ శిబిరంలో వైద్యులు రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్ష, కార్యదర్శులు బోనుదేవి చంద్రమౌళి, గురజాన చంద్రమౌళి, పార్టీ అరకు పార్లమెంట్ ఉపాధ్యక్షుడు గొట్టాపు వెంకటనాయుడు, సర్పంచ్ వంగపండు లక్ష్మి, పార్టీ నాయకులు వంగపండు త్రినాధ్‌నాయుడు, రొంపిల్లి ప్రభాకరరావు, రొంపిల్లి సుభద్రమ్మ, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa