ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాఠశాల భవనం మరమ్మతులకి చర్యలు చేపట్టండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 05, 2024, 02:43 PM

మడకశిర పరిధిలోని అమరాపురం మండలం కరిదాసనహట్టి గ్రామంలోని మండల పరిషత పాఠశాల భవనాన్ని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి పరిశీ లిం చారు. భవనం పైకప్పు పెచ్చులు ఊడి ఉండడం గమనించారు. చిన్నపాటి వర్షానికే పాఠశాల భవనం అంతా కారుతోందని గ్రామ స్థులు ఆయనకు తెలిపారు. వెంటనే ఆయన సంబంధిత అధికా రులతో మాట్లాడి త్వరితగతిన మరమ్మతులు చేయించాలని సూచిం చారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, విద్యార్థులకు నాణ్యమైన భోజనం వడ్డించాలని ప్రధానోపాధ్యాయురాలు పర్వీనకు సూచించారు. టీడీపీ నాయకులు పరమేశ్వరప్ప, పురుషోత్తం, శివకుమార్‌, తిమ్మేగౌడ్‌, రాజశేఖర్‌, సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com