పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించి, మట్టి వినాయక విగ్రహాలతో పూజించాలని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ పిలుపునిచ్చారు. గురువారం కర్నూలు పాతనగరంలోని పాతబస్టాండు సమీపంలో వాసవీ ఏజెన్సీప్ ఎండీ విశ్వనాథం శేషఫణి శెట్టి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సుమారు 2 వేల విగ్రహాలను టీజీ వెంకటేశ రాష్ట్ర ఆర్యవైశ్య నాయకుడు ఇల్లూరు లక్ష్మయ్య, దేవకి వెంకటేశ్వర్లు, విశ్వనాథం శేషఫణి శెట్టితో కలిసి పంపిణీ చేశారు.