ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటిస్తున్నారు. కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో కలిసి ఆయన పర్యటిస్తున్నారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. అనంతరం.. ప్రజల్లోకి వెళ్లి వారి పరిస్థితిని శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోదీ ఆదేశాల మేరకు వరద నష్టం పరిశీలనకు వచ్చానని.. రైతులు ఎవరు కన్నీరు కార్చ వద్దని.. రైతులకు అండగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉందని స్పష్టం చేశారు.